చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రెండు వారాలు మైదానానికి దూరమయ్యే సూచనలున్నాయని ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గాయం కావడం వల్ల బ్రావో ఆఖర్లో మైదానం వీడగా.. తప్పనిసరి పరిస్థితుల్లో ధోని చివరి ఓవర్‌ను జడేజాతో వేయించాడు. 17 పరుగులు అవసరమైన ఆ ఓవర్లో అక్షర్ పటేల్ మూడు సిక్స్‌లు బాది దిల్లీని గెలిపించాడు.
'బ్రావో కోలుకోవడానికి రెండు వారాలు పట్టొచ్చు' - గాయం కారణంగా బ్రావో దూరం
సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రెండు వారాలు మైదానానికి దూరమయ్యే అవకాశం ఉందని చెన్నై జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. గాయం కారణంగా అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.
'బ్రావో కోలుకోవడానికి రెండు వారాలు పట్టొచ్చు'
"బ్రావోకు గజ్జల్లో గాయమైనట్లు తెలుస్తోంది. అతను తప్పనిసరి పరిస్థితుల్లో మైదానం వీడాడు. చివరి ఓవర్ వేయలేకపోయినందుకు డ్వేన్ ఎంతో నిరాశపడ్డాడు. అతను కోలుకోవడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది" అని ఫ్లెమింగ్ చెప్పాడు.