తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్: కార్తిక్​, అంపైర్​ మధ్య తెలుగు సంభాషణ - ఐపీఎల్​లో తెలుగు సంభాషణ

మైదానంలో కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాట్స్​మన్​ దినేశ్​ కార్తిక్​, అంపైర్​ షంషుద్దీన్​ మధ్య జరిగిన తెలుగు సంభాషణ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. దినేశ్​ కార్తిక్​కు తెలుగు వచ్చా..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

dinesh karthik umpire shamshuddin conversation in telugu video goes viral
దినేశ్​ కార్తిక్​, అంపైర్​ తెలుగు సంభాషణ వైరల్​

By

Published : Oct 31, 2020, 10:46 AM IST

ఐపీఎల్​లో గురువారం కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్​కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కోల్​కతా బ్యాట్స్​మన్​ దినేశ్​ కార్తిక్​, అంపైర్​ షంషుద్దీన్​ మధ్య తెలుగులో సంభాషణ జరిగింది. సీఎస్కే బౌలర్ సామ్​ కరన్​ వేసిన బంతిని ఎదుర్కొన్న కార్తిక్​.. 'వైడ్​ కాదా..?' అని అంపైర్​ను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన అంపైర్​ షంషుద్దీన్​.. 'లోపల.. చానా లోపల.. కొంచెం కూడా కాదు' అని చెప్పాడు. వీరిద్దరి మధ్య జరిగిన తెలుగు సంభాషణ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. తమిళనాడుకు చెందిన దినేశ్​ కార్తిక్​కు తెలుగు వచ్చా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details