తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నై ట్విట్టర్​ను రైనా అన్​ఫాలో చేశాడా? - ఐపీఎల్​

ఐపీఎల్ ఈ సీజన్​​ నుంచి తప్పుకున్న చెన్నై సూపర్​కింగ్స్ క్రికెటర్ రైనా.. ట్విట్టర్​లో సీఎస్కేను అన్​ఫాలో చేశాడంటూ వార్తలు హల్​చల్ చేస్తున్నాయి. ఇందులో వాస్తమెంత?

Suresh Raina
రైనా

By

Published : Sep 27, 2020, 4:15 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​ నుంచి తప్పుకుని అభిమానులకు నిరాశ మిగిల్చాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా. వ్యక్తిగత కారణాలతోనే లీగ్​ నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాడు. మళ్లీ టోర్నీలో అడుగుపెట్టే అవకాశాలైతే కనిపించడం లేదు. ప్రస్తుతం తన కుటుబంతో సరదాగా సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే, రైనా ఐపీఎల్​ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో అనేక వార్తలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టాయి. చెన్నై సూపర్​ కింగ్స్​తో, రైనాకు విభేదాలొచ్చాయని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు రైనా, సీఎస్కేను ట్విట్టర్​లో అన్​ఫాలో అయినట్లు నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

రైనా ట్విట్టర్​

అయితే, ఇవన్నీ కేవలం అవాస్తవాలేనని తేలింది. పదేళ్లుగా సీఎస్కేలో భాగమైన రైనా.. ఇప్పటికీ ఫ్రాంచైజీ ట్విట్టర్​ను అనుసరిస్తున్నాడు. టోర్నీలో ఆడనప్పటికీ సీఎస్కే కూడా ట్విట్టర్​, ఇన్​స్టా​ల్లో రైనాను ఫాలో అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details