తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ కెరీర్​లో ధోనీ మరో ఘనత! - latest ipl

సీఎస్కే​ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ మరో రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్​ కెరీర్​లో 194 మ్యాచ్​లు ఆడిన క్రికెటర్​గా గుర్తింపు సాధించాడు. సన్​రైజర్స్​తో ఆడిన మ్యాచ్​తో ఈ ఘనత సాధించాడు.

dhoni
ధోనీ

By

Published : Oct 3, 2020, 6:37 AM IST

చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆడిన మ్యాచ్‌ అతడికి ఐపీఎల్‌ కెరీర్‌లో 194వది. ఈ లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా మహీ రికార్డు నెలకొల్పాడు. దీంతో సహచరుడు సురేశ్‌ రైనా (193)ను అధిగమించాడు. చెన్నై తరఫున ధోనికి ఇది 164వ మ్యాచ్‌. సీఎస్‌స్కేపై రెండేళ్ల నిషేధం కారణంగా 2016, 17 సీజన్లలో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ జట్టులో ధోని 30 మ్యాచ్‌లు ఆడాడు.

ఐపీఎల్​ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న మహీ.. 2010,11,18 సీజన్లలో చెన్నైకి టైటిల్​ అందించాడు. అతని సారథ్యంలో ఆ జట్టు ఎనిమిది సార్లు ఫైనల్​ చేరింది. ఇప్పటి దాకా, ఈ లీగ్​లో అత్యధిక మ్యాచ్​లు ఆడిన రైనా.. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలిగాడు.

ABOUT THE AUTHOR

...view details