రాజస్థాన్‌తో మంగళవారం జరిగిన పోరులో చెన్నై ఓడిపోయినప్పటికీ చివర్లో మూడు వరుస సిక్సర్లు బాది ధోనీ అభిమానులను అలరించాడు. అయితే అతడు ఏడో స్థానంలో క్రీజులోకి రావడాన్ని గౌతమ్ గంభీర్ సహా పలువురు క్రికెటర్లు తప్పుబట్టారు. ముందుగానే వస్తే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. చెన్నై 217 లక్ష్యంతో బరిలోకి దిగగా.. మహి ఏడో స్థానంలో వచ్చే సరికి అప్పటికే చేయాల్సిన రన్‌రేట్ భారీగా ఉంది. డుప్లెసిస్ కూడా 72 వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో జట్టు 200 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మరో రికార్డుకు అతి చేరువలో ధోనీ - తాజా ధోనీ వార్తలు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరో రికార్డుకు దగ్గర్లో ఉన్నాడు. టీ20ల్లో 298 సిక్సులు బాదిన మహీ.. మూడువందల క్లబ్లో చేరేందుకు కేవలం రెండు సిక్సర్లే కొట్టాల్సి ఉంది. శుక్రవారం దిల్లీతో జరిగే మ్యాచ్‌లో అతడు ఈ ఘతన సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అయితే చివరి ఓవర్‌లో 38 పరుగులు సాధించాల్సి ఉండటం వల్ల చెన్నై ఓటమి దాదాపు ఖరారైపోయింది. కాగా ఇంగ్లాండ్ పేసర్ టామ్ కర్రమ్ వేసిన చివరి ఓవర్‌లో చెన్నై సారథి రెచ్చిపోయాడు. మూడు బంతుల్లో వరుస సిక్సర్లు బాది పూర్వపు ధోనీని గుర్తుకుతెచ్చాడు. ఆ మూడు సిక్సర్లుతో టీ20ల్లో భారత మాజీ సారథి సిక్సర్ల సంఖ్య 298కి చేరింది. అతడు మూడు వందల క్లబ్బులో చేరేందుకు ఇంకా కేవలం రెండే సిక్సర్లు కావాల్సి ఉంది. ధోనీ ఆ రెండు సిక్సులు బాదితే 300ల జాబితాలో చేరిన మూడో భారతీయుడిగా ఘనత సాధిస్తాడు.
ఇప్పటికే రోహిత్ శర్మ (361), సురేశ్ రైనా (311) ఈ క్లబ్బులో ఉన్నారు. ఈరోజు దిల్లీతో జరిగే మ్యాచ్‌లో మహి ఈ ఫీట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.