తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రికార్డు సాధించిన తొలి క్రికెటర్​గా ధోనీ

రాజస్థాన్​తో మ్యాచ్​లో బరిలో దిగిన ధోనీ.. ఐపీఎల్​లో 200 మ్యాచ్​లు ఆడిన తొలి క్రికెటర్​గా నిలవడం సహా చెన్నై తరఫున 4000 పరుగులు పూర్తి చేశాడు.

ధోనీ
ధోనీ

By

Published : Oct 19, 2020, 9:28 PM IST

ఐపీఎల్ చరిత్రలో ధోనీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టోర్నీలో 200 మ్యాచ్​ల మార్క్​ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్​కింగ్స్ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. ఇతడి తర్వాత రోహిత్ శర్మ(197 మ్యాచ్​లు), రైనా(193), దినేశ్ కార్తిక్(191) ఉన్నారు. ఈ లీగ్​లో సీఎస్కే తరఫున 4వేల పరుగులు పూర్తి చేశాడు ధోనీ.

2008 నుంచి చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్​గా ఉన్న ధోనీ.. 2015 వరకు ప్రతి మ్యాచ్ ఆడాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ జట్టుపై రెండేళ్లు(2016-17) నిషేధం విధించిన సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున 30 మ్యాచ్​లు ఆడాడు.

ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై జట్టు.. ప్రతి సీజన్​లో ఫ్లే ఆఫ్స్​కు అర్హత సాధించింది. మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. గతేడాది ఫైనల్లో ముంబయి చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. మొత్తంగా చెన్నై తరఫున 169 మ్యాచ్​లాడి 102 సార్లు జట్టును గెలిపించాడు.

ఇదీ చూడండిరాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 126

ABOUT THE AUTHOR

...view details