ఈ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు సాధించాడు. ఓ సీజన్లో అత్యధికంగా ఐదు అర్ధ సెంచరీలు చేసిన వర్ధమాన క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు శిఖర్ ధావన్(2008), శ్రేయస్ అయ్యర్(2015)లో చెరో నాలుగు అర్థ సెంచరీలతో రికార్డును నెలకొల్పారు. అప్పుడు వారిద్దరు దిల్లీ క్యాపిటల్స్‌కే ప్రాతినిధ్యం వహించారు. సోమవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో వారిద్దరి రికార్డును అధిగమించి పడిక్కల్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
కోహ్లీ రికార్డును అధిగమించిన పడిక్కల్ - devdutt padikkal supasses sikhar dhawan record
బెంగళూరు జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్లో ఐదు అర్ధ సెంచరీలు బాదిన వర్ధమాన క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో పాటే సీజన్లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు(472) చేసిన మైలురాయిని అందుకున్నాడు.
పడిక్కల్
దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పడిక్కల్ సారథి విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 472 పరుగులు చేశాడు. మొత్తంగా 51 ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లు బాదాడు.
ఇదీ చూడండి'అన్ని మ్యాచ్‌ల్లో ఆడనందుకు బాధపడ్డా'