తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది దిల్లీ క్యాపిటల్స్. మరోవైపు వరుస ఓటములతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడీ రెండు జట్లు మంగళవారం మ్యాచ్‌లో తలపడనున్నాయి. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల కల నెరవేర్చాలని సన్‌రైజర్స్, గెలుపు స్వారీ చేస్తూ మరింత వేగంగా దూసుకెళ్లాలని దిల్లీ భావిస్తున్నాయి.
దిల్లీ జట్టు
తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై, ఆ తర్వాత చెన్నైని ఓడించింది దిల్లీ క్యాపిటల్స్. సీఎస్కేతో మ్యాచ్‌లో పృథ్వీ షా(64), శిఖర్ ధావన్(35), రిషభ్ పంత్(37) అద్భుతంగా ఆడి, విజయంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. పేసర్లు రబాడ, అన్రిచ్తో పాటు స్పిన్నర్లు అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాలతో జట్టు బలంగా ఉంది. తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న అశ్విన్.. ఈరోజూ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ జట్టు