గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. తాజాగా ఇతడి స్థానంలో యువ స్పిన్నర్ ప్రవీణ్ దూబేను తీసుకుంది ఫ్రాంచైజీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
అమిత్ మిశ్రా స్థానంలో ప్రవీణ్ దూబే - ప్రవీణ్ దూబే ఐపీఎల్
గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగిన అమిత్ మిశ్రా స్థానంలో ప్రవీణ్ దూబేను తీసుకుంది దిల్లీ క్యాపిటల్స్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
అమిత్ మిశ్రా స్థానంలో ప్రవీణ్ దూబే
ఉత్తరప్రదేశ్లో జన్మించిన ప్రవీణ్ దేశవాళీల్లో కర్ణాటక జట్టుకు ప్రాతనిధ్యం వహించాడు. ఇంతకుముందు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇతడిని తీసుకుంది.
దూబే 14 దేశవాళీ మ్యాచ్లు ఆడి 16 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ రేట్ 6.87గా ఉంది.