తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ ఓటముల్లో దిల్లీ జట్టు సెంచరీ - ఐపీఎల్ తాజా వార్తలు

టీ20 లీగ్​లో అనవసర రికార్డును ముటగట్టుకున్న దిల్లీ జట్టు.. ఈ టోర్నీలో 100 సార్లు ఓడిన రెండో టీమ్​గా నిలిచింది. మొదటి స్థానంలో పంజాబ్ ఉంది.

Delhi Capitals Register Unwanted Record in IPL
ఓటముల్లో సెంచరీ కొట్టిన దిల్లీ జట్టు

By

Published : Oct 12, 2020, 10:21 AM IST

ఈ ఐపీఎల్​లో దిల్లీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో తొలుత హైదరాబాద్‌ చేతిలో, తర్వాత ముంబయి(ఆదివారం మ్యాచ్) చేతిలో మట్టికరిచింది. దీంతో ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 ఓటములతో 10 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఓ అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

శనివారం కోల్‌కతా చేతిలో ఓటమి పాలైన పంజాబ్‌.. లీగ్‌ చరిత్రలో మొత్తం 100 మ్యాచ్‌లు ఓడిన తొలి జట్టుగా చెత్త రికార్డు సృష్టించింది. ముంబయి చేతిలో ఆదివారం భంగపడ్డ దిల్లీ.. అదే అవసరం లేని ఘనతను తన పేరిట నమోదు చేసుకుంది. దీంతో టోర్నీలో 100 మ్యాచ్‌ల్లో ఓడిన రెండో జట్టుగా అవతరించింది.

ఈ టోర్నీలో దిల్లీ ఇప్పటివరకు ఫైనల్‌ చేరలేదు. 2009, 2012, 2019 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరినా మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే యూఏఈలో జరుగుతున్న 13వ సీజన్‌లో విశేషంగా రాణిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌, ముంబయి జట్లతో ఓటమి తప్ప మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించింది.

పాయింట్ల పట్టికలో ముంబయితో సమానంగా 10 పాయింట్లు సాధించినా రన్‌రేట్‌ పరంగా రెండో స్థానంలో నిలిచింది. రాబోయే రోజుల్లోనూ దిల్లీ ఇలాగే కొనసాగితే అది ఫైనల్‌ చేరి కప్పు గెలిచినా ఆశ్చర్యం లేదు. ఈ క్రమంలోనే శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌ తొలిసారి టైటిల్‌ గెలుస్తుందో లేదో వేచిచూడాలి.

ABOUT THE AUTHOR

...view details