సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2లో హైదరాబాద్‌ను 17 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. లీగ్ చరిత్రలో తుదిపోరుకు చేరడం దిల్లీకి ఇదే ప్రథమం.
సన్‌రైజర్స్ ఓటమి.. ఫైనల్‌కు దిల్లీ - సన్‌రైజర్స్ ఓటమి.. ఫైనల్‌కు దిల్లీ
అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.
సన్‌రైజర్స్ ఓటమి.. ఫైనల్‌కు దిల్లీ
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (78; 50 బంతుల్లో, 6×4, 2×6) అర్ధశతకంతో అదరగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్‌సేన ఎనిమిది వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. విలియమ్సన్ (67; 45 బంతుల్లో, 5×4, 4×6), అబ్దుల్ సమద్ (33; 16 బంతుల్లో, 2×4, 2×6) పోరాడారు.