తెలంగాణ

telangana

By

Published : Oct 5, 2020, 6:07 PM IST

ETV Bharat / sports

గాయం కారణంగా లీగ్​ నుంచి మిశ్రా ఔట్

యూఏఈ వేదికగా జరుగుతోన్న ఐపీఎల్​ నుంచి దిల్లీ క్యాపిటల్స్​ లెగ్​ స్పిన్నర్​ అమిత్​ మిశ్రా వైదొలిగాడు. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో వేలు విరిగిన కారణంగా టోర్నీలో ఇక ఆడకపోవచ్చని ఆ జట్టుకు చెందిన ఓ అధికారి వెల్లడించాడు.

Delhi Capitals leg-spinner Amit Mishra out of IPL with fractured finger
ఐపీఎల్​ నుంచి నిష్క్రమించిన స్పిన్నర్​ అమిత్​శర్మ

ఐపీఎల్​ నుంచి దిల్లీ క్యాపిటల్స్​ లెగ్​ స్పిన్నర్​ అమిత్​ మిశ్రా వైదొలిగాడు. షార్జా వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో వేలు విరగడం వల్ల అతడు విశ్రాంతి కోసం టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ జట్టు అధికారి ఒకరు స్పష్టం చేశారు.

అక్టోబరు 3న కేకేఆర్​ బ్యాట్స్​మన్​ నితీశ్​ రానా కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకునే క్రమంలో అమిత్ మిశ్రా వేలికి గాయమైంది. ఆ నొప్పిని భరిస్తూనే తర్వాతి రెండు ఓవర్లు వేసి శుభ్​మన్​ గిల్​ను ఔట్​ చేశాడు.

"కోల్​కతాపై ఆడుతున్న మ్యాచ్​లో అమిత్​ మిశ్రా ఉంగరపు వేలు విరిగిపోయింది. దీంతో ఐపీఎల్​ నుంచి నిష్క్రమించనున్నాడు. టోర్నీ నుంచి అమిత్​ తప్పుకోవడం మాకు చాలా నిరాశ కలిగించింది"

- దిల్లీ క్యాపిటల్స్​ అధికారి

అమిత్​ మిశ్రాకు విరిగిన వేలుకు సంబంధించిన వైద్యంతో పాటు భారత్​కు తిరిగి వెళ్లడంపై నిపుణుడిని సంప్రదిస్తామని దిల్లీ క్యాపిటల్స్​ యాజమాన్యం ఓ అధికారిక ప్రకటన చేసింది.

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో అమిత్​ మిశ్రా.. దిల్లీ క్యాపిటల్స్​ తరఫున మూడు మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్​పై 2 వికెట్లు తీసి 25 రన్స్​ ఇవ్వగా.. కోల్​కతా నైట్​రైడర్స్​పై ఒక వికెట్​ పడగొట్టి 14 పరుగులు సమర్పించాడు. చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుపై వికెట్​ సాధించక పోయినా.. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు మిశ్రా.

అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్​

ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో వ్యక్తిగా అమిత్​ మిశ్రా(160) ఘనత సాధించాడు. ఆ జాబితాలోని అగ్రస్థానంలో లసిత్​ మలింగ (170) ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details