తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోల్​కతా vs దిల్లీ: గెలుపు కోసం ఒకరు.. టాప్ కోసం మరొకరు! - కోల్​కతా జట్టు

అబుదాబి వేదికగా కోల్​కతా-దిల్లీ జట్ల మధ్య శనివారం మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపుగా ఫ్లేఆఫ్స్​లో చోటు దక్కించుకున్న దిల్లీ.. ఇందులోనూ గెలిచి దానిని పటిష్ఠం చేసుకోవాలని భావిస్తోంది.

Delhi Capitals eye collective batting effort to keep place at top, KKR aim to stay in hunt
కేకేఆర్Xడీసీ

By

Published : Oct 24, 2020, 5:31 AM IST

ఈ ఐపీఎల్ సీజన్​లో వరుస విజయాలతో అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది దిల్లీ క్యాపిటల్స్. కానీ గత మ్యాచ్​లో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. అలానే ఈ సీజన్​లో అస్థిర ప్రదర్శనతో అంచనాల్ని అందుకోవడంలో విఫలమవుతోంది కోల్​కతా నైట్​రైడర్స్. ప్లే ఆఫ్స్​కు వెళ్లాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్​లో ఉన్న పైనున్న దిల్లీ.. ఎలాగైనా తొలి నాలుగు స్థానాల్లో నిలవాలని కోల్​కతా పట్టుదలతో ఉన్నాయి. అలాంటి ఈ రెండు జట్ల మధ్య అబుదాబి వేదికగా శనివారం మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

మళ్లీ గాడిలోకి దిల్లీ

దిల్లీ బ్యాటింగ్​లోనే కాక బౌలింగ్​లోనూ బలంగానే కనిపిస్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ జోరుమీదున్నాడు. వరుసగా రెండు మ్యాచ్​లో రెండు సెంచరీలు చేసి ఐపీఎల్లో రికార్డు సృష్టించాడు. యువ ఆటగాడు పృథ్వీ షా ఇంకాస్త బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. గత నాలుగు ఇన్నింగ్స్​ల్లో రెండుసార్లు డకౌట్ కావడం జట్టును ఆందోళన కలిగిస్తోంది. సారథి శ్రేయస్ అయ్యర్, బ్యాట్​తో అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్​లకు దూరమై, పంజాబ్​ మ్యాచ్​తో తిరిగి జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ పంత్.. తనపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. మిడిలార్డర్​లో శ్రేయస్, పంత్​తో పాటు స్టోయినిస్​ దిల్లీకి ప్రధాన బలం. బౌలింగ్​లో అన్రిచ్, కగిసో రబాడ నిలకడైన ప్రదర్శన చేస్తున్నారు.

ధావన్

కోల్​కతా ఇకనైనా!

బెంగళూరుతో మ్యాచ్​లో నిర్ణీత ఓవర్లలో కేవలం 84 పరుగులే చేసి, దారుణంగా విఫలమైన కోల్​కతా నైట్​రైడర్స్ తిరిగి గాడిన పడాల్సిన అవసరముంది. ఈ మ్యాచ్​తో కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని తిరిగి పొందాలనుకుంటోంది. ఇప్పటికే కెప్టెన్సీలో మార్పు జరిగినా ఆటతీరు మారట్లేదు. ఇటీవలే జట్టులోకి వచ్చిన ఫెర్గూసన్ ప్రదర్శన మాత్రం జట్టుకు కొంత ఊరట. గాయం కారణంగా గత మ్యాచ్​కు దూరమైన ఆల్​రౌండర్ రసెల్.. ఈరోజు ఆడాలని యాజమాన్యం భావిస్తోంది. కెప్టెన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, శుభ్​మన్ గిల్, నితీశ్ రానా రాణిస్తే కోల్​కతాకు విజయావకాశాలు మెరుగుపడతాయి.

గిల్, కార్తీక్

జట్ల (అంచనా)

దిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్​మెయర్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్​పాండే, కగిసో రబాడ, అన్రిచ్, అక్షర్ పటేల్

కోల్​కతా నైట్​రైడర్స్

శుభ్​మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానా, టామ్ బాంటన్, దినేశ్ కార్తీక్, మోర్గాన్ (కెప్టెన్), కమిన్స్, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ

ABOUT THE AUTHOR

...view details