తెలంగాణ

telangana

ETV Bharat / sports

శతక్కొట్టిన ధావన్​.. సీఎస్కేపై దిల్లీ ఘన విజయం - ipl live score

చెన్నై సూపర్​ కింగ్స్​పై దిల్లీ క్యాపిటల్స్​ ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ ఒక్క బంతి మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్​ ధావన్​(101) సెంచరీతో మెరిసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో శ్రేయస్​ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. చెన్నై బౌలర్లలో చాహర్​(2) సామ్​ కరణ్,​ శార్దూల్​ ఠాకూర్​, బ్రావో తలో వికెట్​ తీశారు.

delhi beat csk
దిల్లీ

By

Published : Oct 17, 2020, 11:39 PM IST

షార్జా వేదికగా ఉత్కంఠంగా సాగిన పోరులో దిల్లీ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చెన్నై సూపర్​ కింగ్స్​పై ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ ఒక్క బంతి మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్​ ధావన్​(101) సెంచరీతో మెరిసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సారథి శ్రేయస్​ అయ్యర్​(23), మార్కస్​ స్టొయినిస్​(24) పర్వాలేదనిపిచ్చారు. ఈ విజయంతో శ్రేయస్​ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. చెన్నై బౌలర్లలో చాహర్​(2) సామ్​ కరణ్,​ శార్దూల్​ ఠాకూర్​, బ్రావో తలో వికెట్​ తీశారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఖాతా తెరవకముందే సామ్‌కరన్‌ను దేశ్‌పాండే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వాట్సన్‌ (36; 28 బంతుల్లో, 6×4)తో కలిసి డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత దూకుడు పెంచడం వల్ల స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో డుప్లెసిస్‌ 39 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. కానీ, తర్వాతి బంతికే వాట్సన్‌ను నోర్జె క్లీన్‌బౌల్డ్‌ చేయడం వల్ల 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే డుప్లెసిస్‌ కూడా వెనుదిరిగాడు. అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 4×6), జడేజా (33*, 13 బంతుల్లో, 4×6) మెరిశారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసింది ధోనీ సేన.

ABOUT THE AUTHOR

...view details