ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మకు గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్‌తో జరగబోయే తొలి మ్యాచ్ ఆడేది అనుమానమే. ఈ విషయాన్ని ఆ జట్టు సహాయక సిబ్బందిలోని ఒకరు తెలిపారు.
తొలి మ్యాచ్‌కు ముందే దిల్లీ జట్టుకు ఎదురుదెబ్బ - ipl 2020
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందే దిల్లీ పేసర్ ఇషాంత్ శర్మకు గాయమైంది. దీంతో ఇతడు మ్యాచ్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇషాంత్ శర్మ
ఇషాంత్ ఆడాలా వద్దా అనేది వైద్యుల సలహా మేరకు తది నిర్ణయం తీసుకుంటామని అతడు చెప్పారు. ఇషాంత్ బదులు అన్రిచ్ నోర్జ్(దక్షిణాఫ్రికా) ఆడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చూడండి కసితో రాయుడు బ్యాటింగ్.. త్రీడీ కళ్లద్దాలు మర్చిపోలేదేమో!
Last Updated : Sep 25, 2020, 5:59 PM IST