సన్‌రైజర్స్‌పై దిల్లీ విజయం
దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. దీంతో తొలిసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది దిల్లీ. ముంబయితో ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.
190 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది దిల్లీ. విలియమ్సన్ 67 పరుగులతో రాణించినా ఫలితం లేకోపోయింది.