వరుస పరాజయాలకు చెక్ పెడుతూ అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు చేరింది. అయితే ఓడినా మెరుగైన రన్‌రేటుతో బెంగళూరు కూడా ప్లేఆఫ్‌కు చేరింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (50) రాణించాడు.
బెంగళూరుపై దిల్లీ గెలుపు.. ప్లేఆఫ్స్‌కు ఇరుజట్లు - ఆర్సీబీ స్క్వాడ్ టుడే
అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో క్వాలిఫైయిర్స్కు శ్రేయస్ జట్టు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఓడినా మెరుగైన రన్‌రేట్ కారణంగా నాకౌట్ దశకు చేరింది.
దిల్లీ క్యాపిటల్స్
అనంతరం దిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అజింక్య రహానె (60), శిఖర్ ధావన్ (54) అర్ధశతకాలతో అదరగొట్టారు. క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబయితో దిల్లీ గురువారం తలపడనుంది. కాగా, రేపటి ముంబయి-హైదరాబాద్ మ్యాచ్‌తో ప్లేఆఫ్‌కు చేరే నాలుగో జట్టు ఎవరనేది తేలనుంది. హైదరాబాద్ గెలిస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో శుక్రవారం తలపడుతుంది. ఒకవేళ ఓటమిపాలైతే కోల్‌కతాతో కోహ్లీసేన అమీతుమీ తేల్చుకుంటుంది.