షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. 18 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది దిల్లీ. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావనతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడారు. అనంతరం ఛేదనకు దిగిన కోల్‌కతా.. చివరి వరకు పోరాడి ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.
షా, అయ్యర్ విజయాలు
ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. దీంతో లీగ్‌లో ఆరు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. మరోవైపు 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన అయ్యర్(1,851)... ఐపీఎల్లో 1,850 మార్కును అధిగమించాడు. లీగ్ కెరీర్లో 14వ అర్థసెంచరీ నమోదు చేశాడు.
రెండో స్థానంలో దిల్లీ
228 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా దిల్లీ రెండో స్థానంలో నిలిచింది. కేకేఆర్‌పై ఇప్పటివరకు ఆడిన జట్లలో దిల్లీదే అత్యధిక స్కోరు. లీగ్‌లో 200 పరుగుల మార్కును చేరుకోవడం దిల్లీకి ఇది ఏడోసారి.