తెలంగాణ

telangana

By

Published : Oct 18, 2020, 6:53 AM IST

ETV Bharat / sports

'వైడ్' వివాదంలో ధోనీకి అండగా వార్నర్

ఇటీవలే ఐపీఎల్​లోని మ్యాచ్​లో వైడ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీకి అండగా వార్నర్​ నిలిచాడు. అందులో అతడి తప్పేమి లేదని అన్నాడు.

David Warner Reacts on 'MS Dhoni vs Paul Rieffel' Wide Drama
'వైడ్' వివాదంలో ధోనీకి అండగా వార్నర్

హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ ధోనీ, అంపైర్‌ పాల్‌ రీఫిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయం అప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పుడు దీని గురించే హైదరాబాద్‌ కెప్టెన్‌ వార్నర్‌ స్పందించాడు. ఇందులో ధోనీ తప్పేమీ లేదన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏ కెప్టెన్‌ అయినా సహనాన్ని కోల్పోతాడని చెప్పాడు.

'ఆరోజు మ్యాచ్‌లో అంపైర్‌ బంతిని వైడ్‌గా పేర్కొని ఉంటే ధోనీకి కోపం వచ్చేది. కానీ, నిజం చెప్పాలంటే అది వైడ్ డెలివరీయే. అంపైర్‌ దాన్ని అలాగే ప్రకటించేవాడు. కానీ అదే సమయంలో ధోనీని చూసి తన నిర్ణయం మార్చుకున్నాడు' అని వార్నర్‌ వివరించాడు.

చెన్నై కెప్టెన్ ధోనీ

అక్కడున్నది ధోనీ లాంటి దిగ్గజం అయినందున తానీ విషయం చెప్పట్లేదని, చెన్నై కెప్టెన్‌.. అంపైర్‌ ఎదురుగా నిలవడం వల్ల అలా చూసి ఉండొచ్చని అన్నాడు. ప్రతి ఒక్కరూ అలా చేస్తారని, ఒక్కోసారి కెప్టెన్లు భావోద్వేగాలు కోల్పోతారని వార్నర్‌ పేర్కొన్నాడు. ఈ విషయంపై పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదన్నాడు.

దుబాయ్‌ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 11 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో శార్దుల్‌ ఠాకుర్‌ బౌలింగ్‌ వేశాడు. రషీద్‌ఖాన్‌ క్రీజులో ఉండగా ఆ బంతి వికెట్లకు దూరంగా వెళ్లింది. దాన్ని అంపైర్‌ వైడ్‌గా ప్రకటించడానికి చేతులు లేపుతుండగా ధోనీని చూశాడు. దాంతో ఒక్కసారిగా చేతులు కిందకు దించాడు. ఆపై హైదరాబాద్‌ 3 పరుగులే చేసి 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ధోనీ భావోద్వేగం కోల్పియిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయింది. ఈ విషయం పెద్ద దుమారం రేపింది.

ABOUT THE AUTHOR

...view details