తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ : గెలిస్తే మరో పోరుకు.. లేదంటే ఇంటికే! - csk vs royals match squad

చెన్నై సూపర్​ కింగ్స్, రాజస్థాన్​ రాయల్స్​​ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

csk vs rajasthan
ఐపీఎల్

By

Published : Oct 19, 2020, 5:31 AM IST

అబుదాబి వేదికగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన తొమ్మిదింటిలో ఆరింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్​ కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తాము ఆడిన గత మ్యాచుల్లో ఓడిన ఇరుజట్లు.. ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్​లో ఓడిన జట్టుకు ప్లేఆఫ్ అవకాశం చేజారిపోతుంది. దీంతో ఇరుజట్లు ఈ పోరును చావోరేవోగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

గెలవాలనే కసితో

చెన్నై జట్టు విజయం కోసం తహతహలాడుతోంది. గత మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై గెలవడానికి చివరిదాకా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డుప్లెసిస్​ మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. వాట్సన్​, జడేజా, రాయుడు బాగానే రాణించారు. గత మ్యాచుల్లో బౌలర్లు చాహర్​, సామ్​ కరణ్​, శార్దూల్​ ఠాకూర్​, బ్రావో కట్టుదిట్టంగా బౌలింగ్​ చేసినప్పటికీ దిల్లీతో జరిగినా మ్యాచ్​లో వారి సత్తా సరిపోలేదు. ఏదేమైనప్పటికీ జట్టు సమష్టిగా రాణిస్తేనే తప్ప విజయాన్ని అందుకోవడం కష్టం. కాబట్టి ఇకపై ఆడే ప్రతి మ్యాచులోనూ విజృంభించాలి. లేదంటే ప్లేఆఫ్స్​ అవకాశాలు చేజార్చుకున్నట్లే.

రాయల్స్​ కూడా ఇదే తంతు

రాయల్స్​ కూడా సీఎస్కే బాటలోనే నడుస్తోంది. విజయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. ఫ్లే ఆఫ్స్​లో అడుగుపెట్టాలంటే ఇకపై ప్రతి మ్యాచ్​ గెలవాల్సి ఉంటుంది. ఈ జట్టులో ఓపెనర్లు సరిగ్గా ఆడలేకపోతున్నారు. మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్ ఇబ్బంది పడుతున్నారు. కానీ గత మ్యాచ్​లో ఉతప్ప, సారథి స్మిత్ బాగానే ఆడారు. అయితే బౌలర్లు​ రాణించినా సరే ఫలితం లేకుండా పోతోంది. ఇలాంటి సమయంలో రాయల్స్ ఏం చేస్తుందో చూడాలి.

జట్లు (అంచనాలు)

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, సామ్ కరన్​, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్, కరన్​ శర్మ.

రాజస్థాన్ రాయల్స్​

స్టోక్స్, జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, కార్తీక్ త్యాగి

ఇదీ చూడండి 'తెవాతియా.. కరోనా వ్యాక్సిన్​ కనిపెట్టగలడు!'

ABOUT THE AUTHOR

...view details