అనేక దేశాల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అభిమానులు ఉన్నారు. ఇక తమిళనాడు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తలా అంటూ ధోనీ ఆటను ఆరాధిస్తారు. నెట్స్‌లో సాధన చేస్తున్నా వీక్షించేందుకు వేల సంఖ్యలో హాజరవుతారు.
ధోనీ ఫ్యాన్ ఇల్లంటే అంతే మరి! - Chennai Super Kings match
ధోనీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు తమినాడుకు చెందిన ఓ అభిమాని. ఇంటికి పసుపు రంగు వేయించి, చెన్నై సూపర్‌కింగ్స్ లోగో, ధోనీ ఫొటోలతో ముస్తాబు చేశాడు.
ధోనీపై అభిమానంతో ఇంటి గోడల మీద మహీ ఫొటోలు
అయితే తమిళనాడు అరంగూర్‌లోని గోపీకృష్ణ అనే వ్యక్తి ధోనీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన ఇంటికి పూర్తిగా పసుపు రంగు వేయించి చెన్నై సూపర్‌కింగ్స్ లోగో, ధోనీ ఫొటోలను గీయించాడు. అంతేకాకుండా ఆ ఇంటికి ధోనీ అభిమాని ఇల్లు అని పేరు పెట్టాడు. ఈ చిత్రాలను చెన్నై సూపర్‌కింగ్స్ ట్విట్టర్లో పంచుకుంది.
ఇదీ చూడండి:సన్‌రైజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం