తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాయుడు, బ్రావో ఫిట్​.. హైదరాబాద్​తో మ్యాచ్​కు రెడీ - అంబటి రాయుడు వార్తలు

హైదరాబాద్​తో మ్యాచ్​కు రాయుడు, బ్రావో అందుబాటులో ఉంటారని చెన్నై సూపర్​కింగ్స్ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్​ చెప్పారు.

Ambati Rayudu, Dwayne Bravo
రాయుడు, బ్రావో

By

Published : Sep 30, 2020, 5:50 PM IST

అభిమానుల భారీ అంచనాల మధ్య ఐపీఎల్​ బరిలో అడుగుపెట్టిన చెన్నై సూపర్​ కింగ్స్​ నిరాశపరుస్తోంది. ఓ వైపు లీగ్​నుంచి కొంతమంది ఆటగాళ్లు తప్పుకోగా.. మరికొందరు గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫలితంగా స్కోరు బోర్డును చెన్నై పురగులు పెట్టించలేక ఓటమిపాలవుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్​ ఫ్రాంచైజీ అభిమానులకు తీపికబురు వినిపించారు. గాయపడిన రాయుడు.. తర్వాత మ్యాచ్​లో ఆడనున్నట్లు తెలిపారు. మరోవైపు డ్వేన్​ బ్రావో కూడా నెట్​లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు.

సీజన్ ప్రారంభ మ్యాచ్​లో ముంబయిపై రాయుడు బ్యాటింగ్​ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత మ్యాచ్​ల్లో అతడు లేనిలోటు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు రాయుడు రాకతో ఫ్రాంచైజీలో నూతనోత్సాహం కనిపించనుంది. మరోవైపు బ్రావో కూడా హైదరాబాద్​తో మ్యాచ్​కు ఎంపికయ్యే అవకాశం ఉందని విశ్వనాథన్​ పేర్కొన్నారు.

ఏడు రోజుల విరామం అనంతరం సరికొత్త జోరుతో సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడేందుకు సిద్ధమైంది ధోనీసేన. అక్టోబరు 2న దుబాయ్​ వేదికగా మ్యాచ్​ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details