తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్ - ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదువార్త. ఈ ఏడాది ఐపీఎల్​లో ప్లే ఆఫ్స్​కు చేరుకోకుండానే సీఎస్కే వైదొలిగింది. తన చివరి రెండు మ్యాచ్​ల్లో గెలిచినా తొలి నాలుగు స్థానాల్లో చోటు సంపాదించుకోవడం కష్టం. దీంతో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టనుంది చెన్నై.

CSK becomes first team to be eliminated from IPL 13
ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్

By

Published : Oct 26, 2020, 11:58 AM IST

మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్​ ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరకుండానే వెనుదిరిగింది. గత 13 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆదివారం ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడం వల్ల చెన్నై ఇంటిముఖం పట్టింది.

ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాల్ని కొద్దిగా మెరుగు పర్చుకున్నట్లు కనిపించింది సీఎస్కే. కానీ తర్వాత మ్యాచ్​లో ముంబయిపై రాజస్థాన్ గెలిచి చెన్నై ఆశలపై నీళ్లు చల్లింది.

చెన్నై సూపర్ కింగ్స్

బెంగళూరుపై గెలిచిన చెన్నైకి ప్రస్తుతం 8 పాయింట్లు ఉన్నాయి. ఇంకా రెండు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలో గెలిచినా సీఎస్కే 12 పాయింట్లకు మాత్రమే చేరుకుంటుంది. ప్లే ఆఫ్స్​లోకి వెళ్లడానికి ఈ పాయింట్లు సరిపోవు.

పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తర్వాత 12 పాయింట్లతో కోల్​కతా నైట్ రైడర్స్ నాలుగో స్థానంలో ఉంది. అనంతరం 10 పాయింట్లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details