చెన్నై సూపర్‌కింగ్స్ యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల చేసిన రెండు వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ప్రాక్టీసులో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే ట్వీట్ చేసింది. క్వారంటైన్లో ఉండటం వల్ల తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయిన ఇతడు.. రాజస్థాన్‌తో మంగళవారం జరిగే పోరులో బరిలో దిగే అవకాశముంది.
ప్రాక్టీసులో రుతురాజ్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌కు? - ఐపీఎల్ తాజా వార్తలు
సీఎస్కే ఆటగాడు రుతురాజ్.. ఎట్టకేలకు మైదానంలో అడుగుపెట్టి ప్రాక్టీసులో పాల్గొన్నాడు. అంతకుముందు కరోనా పాజిటివ్ రావడం, రెండు వారాల ఐసోలేషన్ ఉండటం వల్ల ముంబయితో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
CSK batsman Ruturaj Gaikwad
ప్రస్తుత సీజన్ నుంచి సురేశ్ రైనా పూర్తిగా తప్పుకోవడం వల్ల అతడి స్థానంలో రుతురాజ్ ఆడతాడని భావిస్తున్నారు. కానీ తొలి మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన డుప్లెసిస్ అద్భుతంగా ఆడి, 58 పరుగులు చేశాడు. రాయుడు(71)తో పాటు విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో రుతురాజ్‌కు ఛాన్స్ ఇస్తారా? బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనేది చూడాలి.
Last Updated : Sep 25, 2020, 5:59 PM IST