ఓ వైపు ఆడుతూనే మరోవైపు కాబోయే భార్య ధనశ్రీతో కలిసి సరదాగా గడుపుతున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ చాహల్. అయితే ధనశ్రీ.. అక్టోబర్ 11న దుబాయ్ చేరుకుంది. అనంతరం కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకుని 17వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు హాజరైంది.
అయితే ఈ మ్యాచ్ తర్వాత వెళ్లి చాహల్‌ను కలుద్దామనుకుంది ధనశ్రీ. కానీ ఆ మ్యాచ్‌కు ముందే అతడిని కలిసి సర్ప్రైజ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఆర్సీబీ ఫ్రాంచైజీ. 'చాహల్ నవ్వు వెనుక కారణం ఇదే' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది.