తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ముంబయి గెలుపు ఎప్పటికీ మారదు' - amitab bachhan latest news

ఉత్కంఠగా సాగిన ఐపీఎల్​ మహాసంగ్రామంలో.. ముంబయి ఇండియన్స్ విజయ ఢంకా మోగించింది. ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో రోహిత్​ సేనపై మాజీలు, క్రికెటర్లు అభినందనల జల్లులు కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రముఖులు.. ప్రశంసిస్తున్నారు.

celebreties and cricketers are praising mumbai indians team who won the trophy
'ముంబయి పల్టాన్స్‌ది సంపూర్ణ ఆధిపత్యం'

By

Published : Nov 11, 2020, 12:31 PM IST

Updated : Nov 11, 2020, 12:47 PM IST

ముంబయి ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిసింది. ఐదోసారి టైటిల్‌ ఎగరేసుకుపోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌తో పాటు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, సురేశ్‌ రైనా, వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌ లాంటి వారు ట్విట్టర్​లో అభినందనలు తెలిపారు.

ముంబయి ఆటగాళ్లది అద్భుత విజయం. పల్టాన్స్‌ది సంపూర్ణ ఆధిపత్యం. గతేడాది ఎక్కడైతే నిలిచారో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించారు. -సచిన్‌ తెందూల్కర్‌

యే.. ముంబయి ఐదోసారి విజేతగా నిలిచింది. అత్యద్భుతం. ఈ జట్టు గెలుపెప్పటికీ మారదు. -అమితాబ్‌ బచ్చన్‌

ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఫ్రాంఛైజీ, అత్యుత్తమైన సారథి. ముంబయి జట్టు విజయానికి నిజమైన అర్హత కలిగింది. అనేక సవాళ్లను ఎదుర్కొని టోర్నీని దిగ్విజయంగా నిర్వహించారు. -వీరేంద్ర సెహ్వాగ్‌

సీజన్‌ మొత్తం గొప్పగా శ్రమించాం. ఈ విజయంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఇదో గొప్ప అనుభూతి.-రోహిత్‌ శర్మ

ఇషాన్ కిషన్‌ సూపర్‌ స్ట్రైకర్‌. భవిష్యత్‌లో తప్పకుండా టీమ్‌ఇండియాకు ఆడే సత్తా ఉన్న ఆటగాడు. నా దృష్టిలో ఇప్పుడే భారత జట్టుకు ఆడగలిగే ఆటగాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన కిషన్‌కు అభినందనలు. ముంబయి టీమ్‌ మొత్తానికి శుభాకాంక్షలు. ఐదోసారి గెలుపొందడం గొప్ప విషయం. -హర్భజన్‌ సింగ్‌

13వ సీజన్‌లో విజేతగా నిలిచిన ముంబయి పల్టాన్స్‌కు అభినందనలు. బీసీసీఐ పట్ల ఎంతో గర్వంగా ఉంది. కఠినమైన పరిస్థితుల్లో ఎంతో దిగ్విజయంగా ఈ సీజన్‌ను నిర్వహించారు. అలాగే ఇలాంటి సమయంలో ఆటగాళ్ల ఆరోగ్య భద్రత గురించి శ్రద్ధ వహించిన బీసీసీఐ మెడికల్‌ టీమ్‌కు కూడా ధన్యవాదాలు. -వీవీఎస్‌ లక్ష్మణ్‌

రోహిత్‌ శర్మ లాంటి గొప్ప సారథి నేతృత్వంలో ముంబయి పల్టాన్స్‌ మరోసారి విజేతగా నిలిచినందుకు అభినందనలు. అలాగే ఫైనల్స్‌ చేరడానికి దిల్లీ జట్టు కూడా ఎంతో శ్రమించింది. -సురేశ్‌ రైనా

మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్​లో దిల్లీ తొలుత బ్యాటింగ్‌ చేసి 156/7 స్కోర్‌ చేయగా, ముంబయి 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచింది.

ఇదీ చూడండి:ముంబయి ఇండియన్స్​కు గూగుల్ సర్​ప్రైజ్​

Last Updated : Nov 11, 2020, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details