తెలంగాణ

telangana

ETV Bharat / sports

మన్కడింగ్​పై అదే నా చివరి వార్నింగ్​: అశ్విన్​ - మన్కడింగ్​

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో దిల్లీ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​కు ఫించ్​ను మన్కడింగ్​ చేసే అవకాశం వచ్చినా చేయలేదు. దానికి కారణమేంటో తాజాగా వివరించాడు అశ్విన్​. అయితే మన్కడింగ్​ చేయడానికి అదే చివరి వార్నింగ్​ అని తెలిపాడు.

cant be the police forever Ravichandran Ashwin
మన్కడింగ్​పై అదే నా చివరి వార్నింగ్​: అశ్విన్​

By

Published : Oct 8, 2020, 7:47 PM IST

క్రికెట్​లో మన్కడింగ్‌పై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని కొందరు క్రికెటర్లు వ్యతిరేకిస్తుంటే, నియమాలకు లోబడే ఉందని మరికొందరు మద్దతు ఇస్తున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్‌ ఫించ్‌ను మన్కడింగ్‌ చేసే అవకాశం లభించినా.. ఔట్‌ చేయని దిల్లీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ మరోసారి దీని గురించి మాట్లాడాడు. తాను బంతి వేయడానికి ముందు ఫించ్‌ క్రీజు దాటి ముందుకు వెళ్లిపోగా, అశ్విన్‌ బంతి వేయడం ఆపేసి అతడి వైపు చూసి వెనక్కి వెళ్లిపోయాడు. అయితే కోహ్లీసేనతో జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్‌ చేసే అవకాశం లభించినా ఎందుకు చేయలేదో అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పంచుకున్నాడు. గతేడాది బట్లర్‌ను అశ్విన్‌ మన్కడింగ్ ద్వారా ఔట్‌ చేయడం చర్చకు దారితీసింది.

"నా చూపుతో ఫించ్‌కు ఎలాంటి సందేశం ఇవ్వలేదు. మెసేజ్‌లు ఇచ్చే అంత పెద్ద నాయకుడినీ కాదు. బౌలింగ్ చేయడానికి వెళ్తుండగా బంగారు హెల్మెట్‌ ముందుకు కదులుతున్నట్లు అనిపించింది (బెంగళూరు ఆటగాళ్ల హెల్మెట్‌ బంగారు రంగులో ఉంటుంది). దీంతో బౌలింగ్ వేయడం ఆపేశా. మన్కడింగ్ చేయాలా వద్దా అని ఆలోచించా. నేను అలా ఆలోచిస్తున్నప్పుడు కూడా ఫించ్‌ క్రీజులోకి వెళ్లలేదు. నా వైపే చూస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటో నాకు తెలియదు. అయితే పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి నేను, ఫించ్‌ మంచి స్నేహితులం. ఎన్నో సందర్భాల్లో కూర్చొని పలు విషయాలు చర్చించుకున్నాం. ఏదీ ఏమైనా మన్కడింగ్‌ గురించి అదే నా ఫైనల్‌ వార్నింగ్."

- రవిచంద్రన్​ అశ్విన్​, దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్​

ఈ విషయం గురించి పాంటింగ్‌తో మాట్లాడానని అశ్విన్ పేర్కొన్నాడు. "క్రీజు నుంచి ఫించ్‌ చాలా దూరం వెళ్లాడని, అతడ్ని నేను ఔట్‌ చేస్తానని భావించాడని పాంటింగ్‌ చెప్పాడు. అయితే ఐసీసీ కమిటీతో రన్‌ పెనాల్టీ గురించి మాట్లాడతానని అతడు అన్నాడు. పెనాల్టీ తీవ్రంగా ఉండాలని నేను భావిస్తున్నా. 10 పరుగుల కోత విధిస్తే ఏ బ్యాట్స్‌మెన్‌ క్రీజు దాటడు. అయితే ఇలా బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయడం నైపుణ్యం కాదు. కానీ బౌలర్‌కు మరో అవకాశం లేదు. దొంగలు పశ్చాతాపం పడే వరకు దొంగతనాలు ఆపలేరు. ఎప్పటికీ నేను పోలీసుగానూ ఉండలేను" అని అశ్విన్ అన్నాడు.

ABOUT THE AUTHOR

...view details