ముంబయి ఇండియన్స్ విజయాల్లో భాగమైన జస్ప్రీత్ బుమ్రాను, ప్రపంచ నం.1 బౌలర్ అని ఆ జట్టు కోచ్ షేన్ బాండ్ ప్రశంసించాడు. ఇలా పిలవడంలో ఎలాంటి సంకోచం లేదని చెప్పాడు. తనతో పనిచేయడాన్ని చాలా ఇష్టపడతానని తెలిపాడు. దాదాపు ఆరేళ్ల నుంచి ముంబయి కోచ్‌గా బాండ్ పనిచేస్తున్నాడు.
'మరో ఆలోచనే లేదు.. బుమ్రా నం.1 బౌలర్' - ఐపీఎల్ వార్తలు
యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని చెప్పాడు ముంబయి కోచ్ షేన్ బాండ్.
బుమ్రా
ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడి, 20.18 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. ఇందులో 76 డాట్ బాల్స్ ఉండటం విశేషం.
అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం తలపడనుంది ముంబయి. రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం 10 పాయింట్లతో రోహిత్ సేన రెండో స్థానంలో, ఎనిమిది పాయింట్లతో కోల్‌కతా నాలుగో స్థానంలో ఉంది.