శ్రీలంక పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ వారసత్వాన్ని ముంబయి ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొనసాగిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా మూడు కీలక వికెట్లు తీసి జట్టుకు సహకరించాడని అన్నాడు.
"బుమ్రా వరల్డ్ క్లాస్ క్రికెటర్. కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ముంబయి ఇండియన్స్ జట్టులో చేరాక ఎన్నో విషయాలను నేర్చుకుని ఎంతో ఎత్తుకు ఎదిగాడు. బుమ్రా మా జట్టుకు తగిన వాడు. లసిత్ మలింగ నుంచి బౌలింగ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మేము చాలా బాగా బ్యాటింగ్ చేసినా.. చివరికి పరాజయం ఎదురైంది. కానీ, ప్రతిమ్యాచ్కూ మెరుగవుతూ వస్తున్నాం. తర్వాత జరగబోయే మ్యాచ్ కోసం కొత్త ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది."