తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నై సూపర్​కింగ్స్​కు మరో దెబ్బ!

దిల్లీతో మ్యాచ్​లో గాయపడిన స్టార్ ఆటగాడు బ్రావో.. మిగిలిన మ్యాచ్​లకు అందుబాటులో ఉండట్లేదని సీఎస్కే సీఈఓ వెల్లడించారు. త్వరలో వెస్టిండీస్ వెళ్లిపోనున్నాడని తెలిపారు.

Bravo will fly back, missed Raina and Harbhajan but must respect decisions: CSK CEO
స్టార్ ఆల్​రౌండర్ బ్రావో

By

Published : Oct 21, 2020, 1:34 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​ స్టార్ ఆల్​రౌండర్​ డ్వేన్ బ్రావో.. మిగిలిన మ్యాచ్​ల్లో ఆడటం లేదు. త్వరలో తన దేశానికి వెళ్లిపోనున్నాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. సీనియర్ ఆటగాళ్లు రైనా, హర్భజన్ లేకపోవడం.. ఈ సీజన్​లో జట్టు విఫలమవడానికి ఓ కారణమని అభిప్రాయపడ్డారు. అయితే టోర్నీకి దూరంగా ఉండాలనే వారి నిర్ణయాల్ని తాము గౌరవించామని అన్నారు. మిగిలిన నాలుగు మ్యాచ్​లకు బ్రావో స్థానంలో తాహిర్​ను తీసుకునే అవకాశముంది.

ఇటీవలే దిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​ సందర్భంగా బ్రావో గాయపడ్డాడు. దీంతో ఆ మ్యాచ్​లో చివరి ఓవర్​ను జడేజాతో వేయించాడు ధోనీ. ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ సిక్సులు కొట్టి, లక్ష్యాన్ని పూర్తి చేయడం వల్ల దిల్లీ విజయం సాధించింది.

ఇప్పటివరకు 10 మ్యాచ్​లాడి కేవలం మూడింట్లోనే గెలిచింది చెన్నై. దీంతో టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫ్లేఆఫ్స్​కు అర్హత సాధించలేకపోయింది. ఈ విషయమై ధోనీతో పాటు ఇతర జట్టులోని ఇతర ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details