మహేంద్రసింగ్ ధోనీకి బౌలింగ్ చేయడమే కాదు.. అతని వికెట్ తీయడం నమ్మశక్యంగా అనిపించలేదని కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసిన ఈ కుర్రాడు.. మహీ వికెట్ పడగొట్టి సత్తా చాటాడు.
"మూడేళ్ల క్రితం చెన్నై చెపాక్ స్టేడియంలో స్టాండ్స్‌లో కూర్చొని ధోనీ బ్యాటింగ్ చూసేవాడిని. ఇప్పుడు అతనికి బౌలింగ్ చేస్తున్నా. అంతేకాదు మహీ వికెట్ తీశాను. ఇదంతా నమ్మశక్యంగా అనిపించట్లేదు. అబుదాబి పిచ్‌పై బంతి గుడ్ లెంగ్త్‌లో వేస్తే ధోనీ వికెట్ తీసే అవకాశం ఉంటుందని భావించా. అదే ప్రణాళిక అమలు చేసి ఫలితం పొందాను. మ్యాచ్ తర్వాత నా ఆరాధ్య ఆటగాడితో ఫొటో తీసుకున్నాను" అని చక్రవర్తి తెలిపాడు.