ముంబయి ఇండియన్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ గాయం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ప్రస్తుతం అతడు ఫిట్‌గా ఉన్నాడని, దిల్లీ క్యాపిటల్స్‌తో మంగవారం జరగబోయే ఐపీఎల్ ఫైనల్లో బరిలో దిగుతాడని అన్నాడు. తమ జట్టుకు అతడే బలమని చెప్పాడు.
"బౌల్డ్ బాగానే ఉన్నాడు. ఫైనల్లో ఆడతాడు. బాగా రాణిస్తాడని అనుకుంటున్నాను. మరి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. కొత్త బంతిని విసరడంలో అతడు దిట్ట. పవర్‌ప్లేలోనూ వికెట్లను బాగా తీస్తాడు. స్వింగ్ బాగా వేస్తాడు. దిల్లీ జట్టు నుంచి అతడిని కొనుగోలు చేయడం మా అదృష్టం. మమల్ని ఎప్పుడూ అసంతృప్తి పరచలేదు. తన పని తాను చక్కగా చేస్తాడు. మా కోసం ఈ రోజు కూడా మెరుగైన ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నాను"