తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​కు మరో దెబ్బ.. టోర్నీ నుంచి భువీ ఔట్

చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో గాయపడ్డ సన్​రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

Bhuvneshwar Kumar ruled out of IPL with hip injury
సన్​రైజర్స్​కు మరో దెబ్బ.. టోర్నీ నుంచి భువీ ఔట్

By

Published : Oct 5, 2020, 4:52 PM IST

Updated : Oct 5, 2020, 7:04 PM IST

చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో గాయం కారణంగా అర్ధాంతరంగా తప్పుకున్నాడు భువీ. దీని తర్వాత ఈ గాయం గురించి ఇప్పుడే చెప్పలేమని వెల్లడించాడు కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే పరీక్షల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు భువీ. దీంతో బౌలింగ్​ విభాగంలో సన్​రైజర్స్​కు పెద్ద దెబ్బ తగిలినట్లైంది.

ఏం జరిగింది

చెన్నైతో జరిగిన మ్యాచ్​లో 19వ ఓవర్​ బౌలింగ్​ చేసిన భువనేశ్వర్​ కుమార్​.. తొడభాగం గాయపడటం వల్ల ఓవర్​ మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. మొదట నొప్పి వచ్చినప్పుడు వైద్యుడి సాయంతో కాస్త కోలుకున్నట్లు కనిపించాడు. తిరిగి బౌలింగ్​ వేసేందుకు ప్రయత్నించగా మళ్లీ నొప్పి మొదలవ్వడం వల్ల మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్​ మిగిలిన ఓవర్​ను పూర్తిచేశాడు.

ఈ టోర్నీలో సన్​రైజర్స్​కు​ ఇదో రెండో దెబ్బ. ఇప్పటికే గాయం కారణంగా ఆల్​రౌండర్ మిచెల్ మార్ష్ టోర్నీకి దూరమయ్యాడు. ఇతడి స్థానంలో జాసన్ హోల్డర్​ను తీసుకుంది యాజమాన్యం.

Last Updated : Oct 5, 2020, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details