రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగమైన బంతి విసిరిన దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ఎన్రిచ్ నోకియా ఐపీఎల్లో రికార్డు సృష్టించాడు. తన మొదటి ఓవర్లోనే గంటకు 156.22 కి.మీ వేగంతో బంతిని విసిరి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందిస్తూ.. బంతిని వేగంగా విసరడానికి తాను రెండేళ్ల నుంచి కష్టపడుతున్నాడని చెప్పుకొచ్చాడు.
"ఐపీఎల్లో నేను వేగమైన బంతిని విసిరానని నాకు తెలియదు. కానీ, అందుకోసం నేను చాలా ప్రయత్నించా. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం చాలా ముఖ్యం. బట్లర్ క్రీజులో ఉన్నప్పుడు బౌలింగ్ చేయడం చాలా ఆసక్తిగా ఉంటుంది. నా బౌలింగ్‌లో స్కూప్ షాట్స్ బాగా ఆడాడు. నేను అంత వేగంగా బంతిని విసిరినా బట్లర్ దాన్ని ఫేస్ చేయడం ఆశ్చర్యం కలిగించింది."