వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. శుభ్‌మన్, రసెల్, వరుణ్ చక్రవర్తిలను సదరు ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవాలని సూచించాడు. గత మూడేళ్ల నుంచి కోల్‌కతాకు ఆడుతున్న గిల్.. 41 మ్యాచుల్లో 939 పరుగులు చేశాడు.
"దిల్లీ క్యాపిటల్స్.. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్ చేసినట్లుగానే కోల్‌కతా గిల్‌ను భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దాలి. అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని భావిస్తే సారథిగా నియమించడం మంచిది. మరో జట్టు గిల్‌ను తీసుకుంటే కష్టమైపోతుంది. ముంబయికి రోహిత్ విజయాలను అందిస్తున్నట్లుగానే.. గిల్ కూడా కోల్‌కతాను విజయాల బాట పట్టిస్తాడు"
-ఆకాశ్‌చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్