ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు గుజరాత్ వాసులను అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. గోవా తీర ప్రాంత గ్రామం అర్పోవాలోని ఓ విల్లాలో వీరు బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఈ ముగ్గురి పేర్లు శక్తి పంజాబ్, విశాల్ అహుజా, హితేశ్ కేశ్వాని అని తెలిపారు. వీరు ఇప్పటివరకు 1.17 కోట్లు సంపాదించారని వివరించారు.
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ - బెట్టింగ్ ముఠా అరెస్ట్
గోవాలోని ఓ విల్లాలో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారు నేరం అంగీకరించినట్లు వెల్లడించారు.
గోవాలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
"మొబైల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించారు. ఈ ముఠాను గుర్తించి అరెస్టు చేశాం" అని గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.