ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. వారి ఆటలకు కళ్లెం వేసేందుకు పోలీసులు నిఘా నేత్రాలతో బెట్టింగ్ నిర్వాహకుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ నిర్వహిస్తోన్న 14మందిని అదుపులోకి తీసుకున్నారు రాజస్థాన్(జైపుర్) పోలీసులు.
"మా రాష్ట్రానికి చెందిన వారు మిగతా రాష్ట్రాలకు వెళ్లి ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని మాకు సమాచారం అందింది. వెంటనే హైదరాబాద్, దిల్లీ, జైపుర్, నాగ్‌పుర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. స్థానిక పోలీసులు సాయంతో 14 మందిని అదుపులోకి తీసుకున్నాం. దర్యాప్తు మరింత ముమ్మరం చేసి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం"