తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి ఇండియన్స్​ జట్టులో మరో కొత్త బౌలర్ - అల్జారీ జోషెఫ్​

బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ముంబయి జట్టు మరో కొత్త పేసర్​ని జట్టులోకి తీసుకుంది. వెస్టిండీస్​ పేసర్​ అల్జారీ జోసెఫ్​ను జట్టు కోసం ఎంపిక చేసుకుంది.

ముంబయి జట్టులో మరో కొత్త బౌలర్

By

Published : Mar 28, 2019, 5:07 PM IST

ఐపీఎల్ పన్నెండో సీజన్​​లో ముంబయి తరఫున ఒక్క మ్యాచ్​ కూడా ఆడకుండానే గాయం కారణంగా నుంచి నిష్క్రమించాడు న్యూజిలాండ్​ పేసర్​ ఆడం మిల్నే. అతడి స్థానంలో​ వెస్టిండీస్​ పేసర్​ అల్జారీ జోసెఫ్​ను తీసుకుంది ముంబయి జట్టు.

వెస్టిండీస్​ పేసర్​ అల్జారీ జోసెఫ్
  • విండీస్​ తరఫున తొమ్మిది టెస్టులు, 16 వన్డేలు ఆడిన ఈ 26 ఏళ్ల యువ ఆటగాడు.. టెస్టుల్లో 25, వన్డేల్లో 24 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఈ కుడిచేతి వాటం పేసర్​ ముంబయి బౌలింగ్​కు మరింత బలంగా మారతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఫ్రాంఛేజీ. ఇప్పటికే శ్రీలంక వెటరన్​ పేసర్​ లసిత్​ మలింగ కూడా జట్టులో చేరాడు.

ముంబయి ఆడిన తొలి మ్యాచ్​లోనే దిల్లీ చేతిలో ఓటమి చెందింది. ఈ రోజు బెంగళూరుతో తలపడనుండగా.. గత మ్యాచ్​లో గాయపడిన బుమ్రా ఆడతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. కానీ ముంబయి యాజమాన్యం బుమ్రా నెట్​ప్రాక్టీసు ఫొటోలు సోషల్​మీడియాలో షేర్​ చేసింది.

బుమ్రా ఫోటోలతో ముంబయి యాజమాన్యం ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details