తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ చివరి మ్యాచ్​లకు వార్నర్, స్మిత్ దూరం! - warner

ప్రపంచకప్ నేపథ్యంలో ఆసిస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్ ఐపీఎల్​ చివరి మ్యాచ్​లకు దూరమయ్యే అవకాశముంది. మే 2 నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ట్రైనింగ్​ క్యాంప్​లో న్యూజిలాండ్​తో ప్రాక్టీస్​ మ్యాచ్​ ఆడనుంది కంగారూ జట్టు.

స్మిత్- వార్నర్

By

Published : Apr 15, 2019, 1:18 PM IST

ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఐపీఎల్​ చివరి మ్యాచ్​లకు దూరమయ్యే అవకాశముంది. ఆసీస్ ప్రపంచకప్​ జట్టులో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. జట్టులోని 15 మంది ఆటగాళ్లు మే 2న బ్రిస్బేన్ ట్రైనింగ్ క్యాంప్​కు హాజరుకావాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది.

సన్​రైజర్స్​లో నిలకడగా రాణిస్తున్న డేవిడ్ వార్నర్​ ఆ జట్టుకు ప్రధాన బలం. ఇప్పటికే నాలుగు మ్యాచ్​ల్లో పరాజయం పాలైంది హైదరాబాద్​. ప్లే ఆఫ్ చేరాలంటే మిగతా మ్యాచ్​ల్లో తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మే 2, 4 తేదీల్లో జరిగే ముంబయి, ఆర్​సీబీ మ్యాచ్​లకు వార్నర్​ దూరం కానున్నాడు.

స్టీవ్​ స్మిత్ రాజస్థాన్ జట్టులో కీలక సభ్యుడు. అతడు దూరమైతే రాయల్స్​పైనా ప్రభావం పడనుంది.

వీరితో పాటు ముంబయి ఆటగాడు జాసన్​, బెంగళూరు క్రికెటర్ స్టాయినిస్​లు ఆసిస్ ప్రపంచకప్​ జట్టుకు ఎంపికయ్యారు. వీరూ ఐపీఎల్​ చివరి మ్యాచ్​లకు దూరం కానున్నారు. మే 2 నుంచి ఆస్ట్రేలియా న్యూజిలాండ్​తో మూడు ప్రాక్టీస్ మ్యాచ్​లు ఆడనుంది.

ఇది చదవండి: ప్రపంచకప్ ఆసిస్ జట్టులో వార్నర్, స్మిత్

ABOUT THE AUTHOR

...view details