తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నువ్వుంటే 100 కాదు... 250 కొట్టాలి' - సన్​రైజర్స్​ హైదరాబాద్​

ఐపీఎల్​లో తను చేసిన తొలి శతకం వార్నర్​ వల్లే వృథా అయిందని అన్నాడు రాజస్థాన్​ ఆటగాడు సంజు శాంసన్​.

వార్నర్​..నా జీవితంలో ఒకరోజును చెడగొట్టావ్​: సంజు

By

Published : Mar 30, 2019, 1:01 PM IST

శుక్రవారం హైదరాబాద్​- రాజస్థాన్​ మధ్య జరిగిన మ్యాచ్​లో సంజు శాంసన్​ శతకంతో అదరగొట్టినా... వార్నర్​ మెరుపు ఇన్నింగ్స్​తో సన్​రైజర్స్​ విజయం సాధించింది. అయితే మ్యాచ్​ అనంతరం సంజు-వార్నర్​ మధ్య చిన్న మాటామంతి జరిగింది. ఆ ఇంటర్యూలో తన అద్భుతమైన రోజును చీకటి రోజుగా మార్చావని.. నువ్వు ప్రత్యర్థిగా ఉంటే 100 పరుగులు చాలవు 250 కొట్టాలని చమత్కరించాడు సంజు.

"శతకం కొట్టడం పట్ల సంతోషంగా ఉన్నా.. ఈ రోజును నాశనం చేశావు. నువ్వు బ్యాటింగ్​ మొదలెట్టావంటే వందల్లో పరుగులు చాలవు. కనీసం 250 పైగా ఉండాలి. 200 పరుగులు భారీ లక్ష్యమైనా మీ జట్టు ప్రదర్శనకు అది చిన్నబోయింది".
- సంజు శాంసన్​, రాజస్థాన్​ రాయల్స్​ బ్యాట్స్​మెన్​

.

"మంచి ఆరంభం ఇవ్వడం వల్లే భారీ స్కోరును ఛేదించగలిగాం. ప్రతి బంతికి పరుగు సాధించేందుకు ప్రయత్నించాం. వివిధ రకాల షాట్లను నెట్స్​లో ప్రయత్నిస్తుంటాను . అదే నేను స్థిరంగా పరుగులు సాధించేందుకు ఉపయోగపడుతుంటుంది".
-వార్నర్, సన్ రైజర్స్ ఆటగాడు

ABOUT THE AUTHOR

...view details