జైపూర్‌లో జరిగిన మహిళా టీ20 మ్యాచ్‌లో మిథాలీరాజ్ నాయకత్వం వహించిన వెలాసిటీ జట్టు విజయం సాధించింది. ప్రత్యర్థి ట్రైల్బ్లేజర్స్ నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగలుండగానే ఛేదించింది. డేనియల్ వ్యాట్ 46, షెఫాలీ వర్మ 34 పరుగులతో ఆకట్టుకున్నారు.
పాయింట్ల పట్టికలో తలో విజయంతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి ఈ రెండు జట్లు. రేపు రాత్రి సూపర్నోవాస్, వెలాసిటీ మ్యాచ్‌తో ఫైనల్లో ఏ జట్లు పోటీపడతాయన్న విషయం తేలిపోతుంది.
113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది వెలాసిటీ జట్టు. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 5 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డేనియల్ వ్యాట్.. షెఫాలీతో కలిసి స్కోరు బోర్డును ముందుకు సాగించింది.
ఈ క్రమంలోనే 34 పరుగులు చేసిన మరో ఓపెనర్ షెఫాలీ వర్మ.. హర్లీన్ డియోల్ బౌలింగ్‌లో ఔటైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిథాలీ రాజ్ సహకారంతో వ్యాట్ రెచ్చిపోయింది. 46 పరుగులు చేసి రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టింది షెఫాలీ.