జైపుర్ వేదికగా జరుగుతున్న మహిళా టీ20 లీగ్లో ట్రైల్బ్లేజర్స్- వెలాసిటీ జట్లు తలపడ్డాయి. బ్లేజర్స్కు స్మృతి మంధాన కెప్టెన్గా, వెలాసిటీ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించింది.
టాస్ గెలిచిన మిథాలీ.. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. సూపర్ నోవాస్తో జరిగిన గత మ్యాచ్లో 90 పరుగులు చేసిన స్మృతి.. ఈరోజు 10 పరుగులకే ఔటైంది. మూడో స్థానంలో వచ్చిన హర్లీన్ డియోల్ 43 పరుగులతో ఆకట్టుకుంది.