తెలంగాణ

telangana

ETV Bharat / sports

వెలాసిటీ వేగానికి సూపర్​నోవాస్​ అడ్డు... లక్ష్యం 122

జైపుర్ వేదికగా సూపర్​నోవాస్​తో జరుగుతున్న మ్యాచ్​లో వెలాసిటీ 121 పరుగులు చేసింది. సుష్మావర్మ, అమిలీయా కేర్ మినహా మిగతా బ్యాట్స్​ఉమెన్ పెద్దగా రాణించలేదు. సూపర్​నోవాస్ బౌలర్లలో తహుహూ 2 వికెట్లు తీసుకుంది.

మ్యాచ్

By

Published : May 11, 2019, 9:49 PM IST

సూపర్​నోవాస్​తో జరుగుతున్న మహిళల టీ 20 ఛాలెంజ్ ఫైనల్​లో వెలాసిటీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. అమిలీయా కేర్(36), సుష్మావర్మ(40) మినహా మిగతా బ్యాట్స్​ఉమెన్ పెద్దగా ఆకట్టుకోలేదు. సూపర్​నోవాస్ బౌలర్లలో తహుహూ 2 వికెట్లు తీయగా... పూనమ్, నటాలియా, సోఫీ, అనుజా పాటిల్ తలో వికెట్ తీసుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన వెలాసిటీ ఖాతా తెరవకుండానే మాథ్యూస్(0) వికెట్​ కోల్పోయింది. అనంతరం వ్యాట్(0)​ కూడా వెనుదిరిగింది. ఒక్కపరుగుకే 2 వికెట్లు కోల్పోయింది వెలాసిటీ. తర్వాత వచ్చిన షఫాలీ వర్మ(11) కూడా ఆకట్టుకోలేకపోయింది. 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో అమిలీయా కేర్, సుష్మా వర్మ రాణించి సూపర్​నోవాస్​కు గౌరవప్రదమైన స్కోరునందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details