తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన సూపర్​నోవాస్.. వెలాసిటీ బ్యాటింగ్​ - వెలాసిటీ

జైపుర్​ వేదికగా వెలాసిటీతో జరుగుతున్న మహిళల టీ 20 ఛాలెంజ్ ఫైనల్​లో సూపర్​నోవాస్ టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు టైటిల్​ దక్కించుకుంటుంది.

మహిళల టీ 20

By

Published : May 11, 2019, 7:15 PM IST

వెలాసిటీతో జరుగుతున్న మహిళల టీ 20 ఛాలెంజ్​ ఫైనల్​ మ్యాచ్​లో సూపర్​నోవాస్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జైపుర్​ వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు టైటిల్​ విజేతగా నిలుస్తుంది. క్వాలిఫయర్​ మ్యాచ్​లోనూ ఈ రెండు జట్లు తలపడగా సూపర్​నోవాస్​ విజయం సాధించింది. లీగ్​లో ఇరు జట్లు చెరో మ్యాచ్​లో గెలిచాయి.

పిచ్​ స్లోగా ఉంది. ఈ మైదానంలో సగటున 140 పరుగులు నమోదవుతున్నాయి. సూపర్​నోవాస్​ జట్టులో మార్పులేమి చేయలేదు. వెలాసిటీ జట్టులో ఓ మార్పు చేసింది. కోమల్​ స్థానంలో దేవికా వైద్యకు అవకాశం కల్పించింది.

జట్లు..

సూపర్​నోవాస్..

ప్రియా పునియా, చమారీ ఆటపట్టు, రోడ్రిగ్స్​, హర్మన్​ప్రీత్​ కౌర్(కెప్టెన్), నటాలీ, సోఫీ, లీ టహూ, తానియా(కీపర్), అనుజా పాటిల్, పూనమ్​ యాదవ్, రాధా యాదవ్.

వెలాసిటీ..

హేలీ మ్యాథ్యూస్, షెఫాలీ వర్మ, వ్యాట్, మిథాలీ రాజ్(కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, సుష్మా వర్మ(కీపర్), శిఖాపాండే, ఆలం, అమిలీయా, దేవికా వైద్య, ఏక్తా బిష్ఠ్​.

ABOUT THE AUTHOR

...view details