ఈ ఐపీఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్ చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైపోయాడు. సొంతగడ్డపై పంజాబ్‌తో తలపడనుంది సన్‌రైజర్స్. మిడిలార్డర్ సమస్య వేధిస్తున్న హైదరాబాద్... ఈ మ్యాచ్‌లో గెలిచి ఫ్లేఆఫ్ అవకాశాల్ని సజీవం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. పదకొండు మ్యాచ్‌లాడిన ఇరుజట్లు పదిపాయింట్లు సాధించాయి. హైదరాబాద్ నాలుగులో ఉండగా, పంజాబ్ ఐదో స్థానంలో ఉంది.
ఐపీఎల్లో ప్రస్తుతం 611 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు వార్నర్. తద్వారా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదే జట్టుకు చెందిన బెయిర్‌స్టో(445 పరుగులు) ఇప్పటికే అతడి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇలా ఓపెనర్లిద్దరూ లేకపోడవం రైజర్స్‌కు లోటే. ఇప్పటివరకు గెలిచిన ఐదు మ్యాచ్‌ల్లోనూ వీరిద్దరూ నమోదు చేసిన భాగస్వామ్యాలే విజయాల్ని తెచ్చిపెట్టాయి.
మనీశ్ పాండే ఫామ్‌లోకి రావడం ఆనందించదగ్గ విషయం. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ అతడికి సహకారమందించాల్సిన అవసరముంది. కీలక సమయాల్లో బౌలర్లు సరైన ప్రదర్శన చేయలేకపోతున్నారు. వీరందరూ శ్రమిస్తే హైదరాబాద్ గెలుపు కష్టమేమి కాదు.
పంజాబ్ జట్టులోనూ ఓపెనర్లు అదరగొడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు గేల్-444 పరుగులు, రాహుల్-441 పరుగులు చేశారు. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ మరోసారి మెరిస్తే పంజాబ్ విజయం సాధించొచ్చు. మాయంక్ అగర్వాల్ వీరికి తోడుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాడు. బెంగళూరుతో గత మ్యాచ్‌లో మెప్పించిన పూరన్ మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని జట్టు భావిస్తోంది.