తెలంగాణ

telangana

ETV Bharat / sports

భాగ్యనగరంలో శతకాల మోత.. ఆర్​సీబీ లక్ష్యం 232 - bengaluru royal challengers

సన్​రైజర్స్, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ప్రత్యర్థి ముందు 232 పరుగుల లక్ష్యాన్ని నిలబెట్టింది.

భాగ్యనగరంలో సెంచరీల సునామీ..ఆర్సీబీ లక్ష్యం 239

By

Published : Mar 31, 2019, 6:01 PM IST

Updated : Mar 31, 2019, 6:53 PM IST

హైదరాబాద్​లో సన్​రైజర్స్, బెంగళూరు మధ్య ఐపీఎల్​ మ్యాచ్​లో పరుగుల వరద పారింది. రైజర్స్ ఓపెనర్లు చెలరేగి ఆడి బెంగళూరు ముందు 232 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. బెయిర్ స్టో, వార్నర్ సెంచరీలతో చెలరేగారు.

  • 'సన్​'ఓపెనర్ల విధ్వంసం

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 16.2 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన వీరిద్దరూ 185 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 114 పరుగులు చేసిన బెయిర్ స్టో క్యాచ్​ అవుట్​గా వెనుదిరిగాడు. చివర వరకు క్రీజులో నిలిచిన వార్నర్... ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ నమోదు చేశాడు.

  • తొలి ఐపీఎల్..తొలి సెంచరీ

అతడికిది తొలి ఐపీఎల్ సీజన్.. ఆడుతున్నది మూడో మ్యాచ్. అయినా ఎక్కడ తడబాటు లేకుండా ఆడాడు బెయిర్​స్టో. ఈ టోర్నీలో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు.

  • భాగస్వామ్యాల 'రికార్డు'

ఐపీఎల్​లో రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు సన్​రైజర్స్​​ ఓపెనర్లు. తొలి వికెట్​కు 185 పరుగులు జోడించిన ఓపెనర్​ జంటగా అరుదైన ఘనత సాధించారు.

  • రైజర్స్ అత్యధిక స్కోరు ఇదే..

ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు​ ఈరోజు మ్యాచ్​లో అత్యధికంగా 231 పరుగులు చేసింది. ఇప్పటి వరకు తమ జట్టు తరఫున ఉన్న 209 పరుగుల రికార్డును చెరిపేసుకుంది.

  • బెంగళూరు బౌలింగ్ విఫలం..

సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు బౌలర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. చాహల్​కు మాత్రమే ఒక వికెట్ దక్కింది. మరో వికెట్​గా విజయ శంకర్ రనౌట్​గా వెనుదిరిగాడు. మిగతా బౌలర్లు వికెట్లేమి తీయలేకపోయారు.

Last Updated : Mar 31, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details