తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో రికార్డు నెలకొల్పిన బెయిర్​స్టో

ప్రస్తుతం ఐపీఎల్​లో సన్​రైజర్స్ తరఫున ఓపెనర్​గా రాణిస్తున్న బెయిర్​స్టో... తాజాగా మరో రికార్డు నెలకొల్పాడు. అరంగేట్రం సీజన్​లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

By

Published : Apr 22, 2019, 9:22 AM IST

ఐపీఎల్​ రికార్డు నెలకొల్పిన బెయిర్​స్టో

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆదివారం కోల్‌కతాతో మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 43 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రస్తుత సీజన్‌లో 445 పరుగులు చేశాడు బెయిర్‌స్టో. తద్వారా ఐపీఎల్​ అరంగేట్ర సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా అరుదైన ఘనత సాధించాడు.

ఇంతకు ముందు ఈ రికార్డు 2015లో దిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (439 పరుగులు) పేరు మీద ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో డుప్లెసిస్(398-చెన్నై సూపర్ కింగ్స్, 2012), ఎల్. సిమ్మన్స్(394-ముంబయి ఇండియన్స్, 2014), ఆర్.త్రిపాఠి (391, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్-2017), లూయిస్ (382, ముంబయి ఇండియన్స్-2018) ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details