తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఓటముల నుంచి కేకేఆర్ గట్టెక్కేనా...! - RR

నేడు ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా జరగనున్న మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​తో కోల్​కతా నైట్​రైడర్స్ తలపడనుంది. వరుస ఓటముల నుంచి బయటపడాలని కేకేఆర్ భావిస్తుండగా, విజయాల పరంపరను కొనసాగించాలని రాజస్థాన్ ఉవ్విళ్లూరుతోంది.

ఓటముల నుంచి కేకేఆర్ గట్టేక్కేనా...!

By

Published : Apr 25, 2019, 7:00 AM IST

లిన్, నరైన్,రసెల్ లాంటి హిట్టర్లున్న జట్టు కోల్​కతా నైట్​రైడర్స్. అయినా గత ఐదు మ్యాచ్​ల్లో ఓటములే ఎదురయ్యాయి. ఈరోజు రాజస్థాన్​తో పోరులో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. మరి ఓటములు నుంచి బయటపడి కేకేఆర్ విజయం సాధిస్తుందే లేదో తెలియాలంటే మ్యాచ్​ చూడాల్సిందే.

ప్రపంచకప్​కు వెళ్లే టీమిండియా జట్టులో దినేశ్ కార్తిక్​ను రెండో వికెట్ కీపర్​గా ఎంచుకున్నారు. కానీ ఐపీఎల్​లో మాత్రం అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. గత సీజన్​లో ఇదే జట్టు తరఫున అద్భుతంగా రాణించిన దినేశ్...ఈ సారి తొమ్మిది మ్యాచ్​ల్లో 16.71 సగటుతో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.

కేకేఆర్​లో దినేశ్ కాకుండా మిగతా భారత క్రికెటర్స్ ఆట ఏమంత మెరుగ్గా లేదు. కుల్దీప్ యాదవ్ కూడా అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. సహచర స్పిన్నర్లు పియూష్ చావ్లా, నరైన్ ప్రభావం చూపలేకపోతున్నారు. ఆడిన 10 మ్యాచ్​ల్లో కలిపి వీరు ముగ్గరు 16 వికెట్లు మాత్రమే తీయగలిగారు. పేస్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది.

"జట్టులోని సభ్యులందరూ ఆటతో అలసిపోయారు. వారికి కొంచెం విశ్రాంతి అవసరం. దినేశ్ కార్తిక్ ఇంటికి వెళ్లి వచ్చాడు. మిగతా వారు కూడా తగినంత విశ్రాంతి తీసుకుని మిగతా మ్యాచ్​ల్లో రాణిస్తారని అనుకుంటున్నా" -జాక్వెస్ కలిస్, కోల్​కతా కోచ్

రాజస్థాన్ రాయల్స్.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. కెప్టెన్​గా స్టీవ్ స్మిత్​ను నియమిన మ్యాచ్​లోనే బలమైన ముంబయిపై విజయం సాధించింది.

దిల్లీతో జరిగిన గత మ్యాచ్​లో రాజస్థాన్ ఓపెనర్​ రహానే సెంచరీతో చెలరేగి ఫామ్​లోకి వచ్చాడు. ఇది కొంత మేర ఆనందించాల్సిన విషయమే. జట్టు గెలవాలంటే మిగతా బ్యాట్స్​మెన్​లో సంజూ శాంసన్, రియాన్ పరాగ్, స్టోక్స్ రాణించాల్సిన అవసరముంది.

బౌలర్లలో ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, పరాగ్.. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

జట్లు (అంచనా)

రాజస్థాన్ రాయల్స్
స్టీవ్ స్మిత్(కెప్టెన్),అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జాస్ బట్లర్, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్ని, శ్రేయాస్ గోపాల్, ఉనద్కత్, రియాన్ పరాగ్, ధవల్ కులకర్ణి

కోల్​కతా నైట్​రైడర్స్
దినేశ్ కార్తీక్​(కెప్టెన్​), క్రిస్​లిన్, శుభ్​మన్​ గిల్​, ఆండ్రూ రసెల్​, సునీల్ నరైన్​, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్​, నితీశ్ రాణా, ప్రసిధ్ క్రిష్ణ, జో డెన్లీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details