తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టెయిన్​కు గాయం.. ఐపీఎల్​కు దూరం - DALE STEYN

ఐపీఎల్​లో ప్రస్తుతం బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు డేల్ స్టెయిన్. భుజం గాయం కారణంగా మిగతా మ్యాచ్​లకు దూరమయ్యాడు.

స్టెయిన్​కు గాయం.. ఐపీఎల్​కు దూరం

By

Published : Apr 25, 2019, 6:33 PM IST

ఐపీఎల్​లో ఇటీవల ఆర్​సీబీ తరఫున ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ అదరగొట్టాడు స్టెయిన్​. కానీ తాజాగా భుజం గాయం కారణంగా మిగతా ఐపీఎల్​ మ్యాచ్​లకు దూరమయ్యాడీ దక్షిణాఫ్రికా పేసర్.

"స్టెయిన్​ భుజానికి గాయమైంది. అందుకే బుధవారం పంజాబ్​తో మ్యాచ్​లో ఆడలేదు. రానున్న ఐపీఎల్​ మ్యాచ్​ల్లో అతడు అందుబాటులో ఉండడు. స్టెయిన్​ రాకతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆర్​సీబీ యాజమాన్యం కోరుకుంటోంది" -సంజీవ్ చుర్వాలా, ఆర్​సీబీ ఛైర్మన్

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఐపీఎల్​లో అడుగుపెట్టాడు స్టెయిన్. కోల్​కతా, చెన్నైతో జరిగిన మ్యాచ్​ల్లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఇంగ్లండ్​లో క్రికెట్ ప్రపంచకప్​ మే 30నుంచి ప్రారంభం కానుంది. అప్పటికి జాతీయ జట్టులోకి అందుబాటులోకి వస్తాడా లేదా అనేది చూడాలి.

ABOUT THE AUTHOR

...view details