తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లేఆఫ్ బెర్త్​పై చెన్నై గురి... హైదరాబాద్​తో పోరు - dhoni

బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ఉత్కంఠ పోరులో ఓడిన చెన్నై.. నేడు సన్​రైజర్స్​తో తలపడనుంది. ఈ మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్స్​లోకి అడుగుపెట్టాలనుకుంటున్న చెన్నైకి.. సన్​రైజర్స్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురైంది.

సన్​రైజర్స్​ - సూపర్​కింగ్స్

By

Published : Apr 23, 2019, 8:00 AM IST

మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమవుతుందనగా చెన్నై వరుసగా రెండు మ్యాచ్​ల్లో ఓడిపోయింది. వరుసగా సన్​రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్​పై ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో బెంగళూరుపై గెలుపు ముంగిట చతికిలపడింది. ధోని అద్భుత ఇన్నింగ్స్​ వృథా అయింది. ఈరోజు జరిగే మ్యాచ్​లో సన్​రైజర్స్​పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది ధోనీసేన.

చెన్నై ప్రధాన బలహీనత టాప్ ఆర్డర్ విఫలమవడం. టోర్నీలో ఇప్పటివరకు వాట్సన్ (147), రాయుడు (192), రైనా (201) పరుగులు మాత్రమే చేశారు. మిడిలార్డర్​లో ధోని మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ సీజన్​లో 314 పరుగులు చేసి చెన్నై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మెన్​గా కొనసాగుతున్నాడు మహీ. సొంత మైదానంలో ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్​లో దీపక్ చాహర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జడేజా, తాహిర్, బ్రావో కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు.

రైజర్స్ ఆటగాళ్లు

సన్​రైజర్స్ జట్టు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్​కతా నైట్ రైడర్స్​పై గెలిచి జోరుమీదుంది. ఈ జట్టు ప్రధాన సమస్య మిడిలార్డల్ విఫలమవడం. వార్నర్ 517 పరుగులతో ఈ సీజన్​లో ఆరెంజ్ క్యాప్​తో కొనసాగుతున్నాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో 445 పరుగులతో టాప్ ఫామ్​లో ఉన్నాడు. వీరిద్దరూ మినహాయిస్తే మిగతా బ్యాట్స్​మెన్ ఆకట్టుకోలేకపోతున్నారు. విలియమ్సన్, దీపక్ హుడా, యూసఫ్ పఠాన్ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్​లో భువనేశ్వర్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.

జట్ల అంచనా

సన్​రైజర్స్ హైదరాబాద్

విలియమ్సన్ (కెప్టెన్), వార్నర్, బెయిర్ స్టో, విజయ్ శంకర్, దీపక్ హుడా, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీం, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్

చెన్నై సూపర్ కింగ్స్

ధోని (కెప్టెన్), వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, కేదార్ జాదవ్, బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, షార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్

ABOUT THE AUTHOR

...view details